![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్- 335 లో.. సర్ ప్రైజ్ ఉందని రాజ్ తో కావ్య చెప్తుంది. ఏంటా సర్ ప్రైజ్ అని రాజ్ ఆసక్తిగా కావ్యని అడుగగా.. ముందే చెప్తే సర్ ప్రైజ్ ఎలా అవుతందండి అని కావ్య అంటుంది. చెప్పకుండా సస్సెన్స్ లో ఉంచితే అది సినిమా అవుతుందని రాజ్ అంటాడు. తను చెప్పనని చెప్పి పడుకుంటుంది. ఆ తర్వాత రాత్రంతా రాజ్ ఆ సర్ ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తూ ఉంటాడు.
మరోవైపు అనామిక, కళ్యాణ్ వారి గదిలో మాట్లాడుకుంటారు. ఏంటి హమ్మయ్య వచ్చేశావా అని కళ్యాణ్ తో అనామిక అనగానే హమ్మయ్య నువ్వు కనికరించావా అని కళ్యాణ్ అంటాడు. ముందు నువ్వు కూర్చో మాట్లాడాలని అనామిక అంటుంది. ఏంటని కళ్యాణ్ అనగానే.. ఆఫీస్ కి వెళ్ళావ్ కదా ఏం జరిగిందని అడుగుతుంది. ఏం జరుగుతుంది.. అని అతను కవితలు చెప్పింది గుర్తుచేసుకుంటాడు. ఇక అకౌంట్స్ చేసాను, గ్రాఫ్ గీసాను.. స్టాఫ్ అందరిని కూర్చోబెట్టి డిస్కస్ చేశానని కళ్యాణ్ అంటాడు. దానికి అనామిక సంతోషపడి ఓ కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మరోవైపు స్వప్న గదిలో ఉండగా .. జ్యూస్ తోసుకొని పనిమనిషి వస్తుంది. తనని చూసి నువ్వేంటి ఇక్కడ? మా అత్త ఏదని అడుగుతుంది. బెడ్ రూమ్ లో ఉన్నారని పనిమనిషి చెప్తుంది. మరోవైపు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావని పాట పెట్టుకొని రుద్రాణి కూల్ గా జ్యూస్ తాగుతూ తన గదిలో ఎంజాయ్ చేస్తుంది. ఇక అక్కడికి స్వప్న వచ్చి చూస్తుంది. తనని చూసి వెంటనే భయపడి మ్యూజిక్ ఆఫ్ చేస్తుంది రుద్రాణి. కడుపుతో ఉన్న బాగోగులు గాలికి వదిలేసి కూల్ గా డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నావా అని స్వప్న అడుగుతుంది. నీకు కావాలసినవి చేయమని పనిమనిషికి చెప్పాను కదా అని రుద్రాణి అనగానే.. ఎంతచేసిన పనిమనిషి సొంతమనిషి కాదు కదా అని స్వప్న అంటుంది. ఇప్పుడు నీకేం కావాలని రుద్రాణి అనగానే అల్జీమర్స్ ఉందా అన్ని మర్చిపోతావ్.. ఇందాకే కదా రెండు లక్షలు కొట్టేసి మా చెల్లి మీద వేయాలనుకున్నారని స్వప్న తిడుతుంది.
మరోవైపు గదిలో పడుకుని ఉన్న రాజ్ సర్ ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తూ ఒక్కసారిగా మెలుకువలోకి వస్తాడు. ఈ కళావతి ఎక్కడికి వెళ్ళిందని కంగారుగా కిచెన్ దగ్గరకి వస్తాడు. అక్కడ తను వంట చేస్తుండగా రాజ్ వచ్చి.. ఏంటా సర్ ప్రైజ్ అని అడుగుతాడు. చెప్పనని కావ్య అంటుంది. అదే సమయంలో అక్కడికి ఇందిరాదేవీ వచ్చి సర్ ప్రైజ్ అని చెప్పి ఇంకా రెడీ కాలేదేంటి.. వెళ్ళి రెడీ అవ్వని కావ్యని పంపిస్తుంది ఇందిరాదేవీ. ఇక రెడీ అవుతున్న కావ్య దగ్గరకి రాజ్ వచ్చి.. సర్ ప్రైజ్ ఏంటని అడుగుతాడు. మా బావ అమెరికాలో జాబ్ చేస్తున్నాడు. మా బావకి నేనంటే చాలా ఇష్టం. నన్ను పెళ్ళి చేసుకుందామనుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు మనిద్దరికి పెళ్ళి అయిందని రాజ్ తో కావ్య అంటుంది. ఏంటి నాతో పెళ్ళి దురదృష్టమా అని రాజ్ అనగానే మీరే అంటారు కదా నాతో పెళ్ళి దురదృష్టమని అని కావ్య సెటైర్ వేస్తోంది. ఇక ఏయిర్ పోర్ట్ కి వెళ్ళడానికి టైమ్ అయిందని తొందరగా వెళ్ళిపోతుంది కావ్య. తరువాయి భాగంలో కావ్య కోసం రాజ్ ఎదురుచూస్తుంటాడు. అప్పుడే కార్ లో నుండి మొదట కావ్య దిగుతుంది. అటువైపుగా ఒకతను దిగుతాడు. దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది. అతనెవరో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |